Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇక అలాంటి సినిమా జీవితంలో చేయను: సంచలన నిర్ణయం తీసుకున్న దీపికా పదుకొనే

  • ఆది నుంచి వివాదాల్లోనే 'పద్మావత్'
  • ఇక అటువంటి సినిమాలను అంగీకరించను
  • సన్నిహితులకు చెప్పిన దీపిక
తాను ఇటీవల నటించిన 'పద్మావత్' చిత్రం ఆదినుంచి వివాదాల్లోనే నడుస్తూ రావడం, వివిధ వర్గాల నుంచి తనకు ఎదురైన బెదిరింపులు తదితరాలతో ఆందోళన చెందిన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే, ఇకపై 'పద్మావత్' వంటి చిత్రాలను జీవితంలో చేయబోనని తెగేసి చెప్పింది.

ఇటీవల ఆమె ఓ ఈవెంట్ కు హాజరుకాగా, సన్నిహితుల వద్ద పరిస్థితి వివరించి వాపోయిన ఆమె, ఇక ఎప్పటికీ ఈ తరహా చిత్రాలను చేయలేనని వెల్లడించిందట. తన తల్లి, తండ్రి ఈ చిత్రాన్ని చూసి తనను అభినందించారని చెప్పిన దీపిక, చిత్రంలో ఖిల్జీ, రావల్ మధ్య జరిగే పోరాట దృశ్యం తనకు ఎంతో ఇష్టమైన సీన్ అని వెల్లడించింది. కాగా, గత వారంలో వెండితెరపై విడుదలైన 'పద్మావత్' నిదానంగా కలెక్షన్లను పెంచుకుంటూ వెళుతోంది.
Deepika Padukone
Padmavat

More Telugu News